Follow by Email

Menu
Recent Post


Veg Masala Rice Recipe | How to make Veg Masala Rice వెజ్ మసాల రైస్
Ingredients:- Onion -1, Mint Leaves, Tomato -1, Bay Leaves 2, Green Chilies 7, Ginger Garlic Paste, Cinnamon, Cloves, Fennel, Cumin, Black pepper, Star Anise Mace, Wailong, Clarified Butter 6 tbsp, Solt, Red Chili Powder, Garam Masala Powder, Curd 2 spoons, Cashews, Raisins, Oil 2 tbsp,  Vegetables ( Carrot, Potato, Beans, Capsicum, Cabbage), Green Peas, Soaked Rice.

తయారీకి కావలసిన పదార్ధాలు:- ఉల్లిపాయ ఒకటి, పొదీనా ఆకులు, టమోట ఒకటి, బిరియాని ఆకులు రెండు, పచ్చిమిరపకాయలు ఏడు, అల్లం వెల్లులి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, శోంప్, జిలకర, మిరియాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, నెయ్యి ఆరు టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, గరం మసాల పొడి, పెరుగు రెండు స్పూన్లు, జీడిపప్పు, ఎండిద్రాక్ష, నూనె రెండు స్పూన్లు, కాయగూరలు ( క్యారెట్, బంగాళదుంప, బీన్స్, బెంగుళూరు మిరపకాయలు, కోస్ పువ్వు (కాబెజి)), ముడి బటాని, బియ్యం. 

   
తయారి విధానం:- పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకొని బాణలిలొ నెయ్యి మరియు నూనె ఒంచుకొని నూనె కాగిన తరువాత జిలకర, బిరియాని ఆకులు, మసాల దినుసులు వేసి రెండు నిమిషాలు వెగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పొదీనా ఆకులతొ ఉప్పును కూడ కలిపి వేగనివ్వాలి. గరం మసాల పొడి, కారం పొడి, పొయ్యి వెలుగుని తగ్గించుకుని టమోటాని కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. రెండు లేద మూడు నిమిషాలు తరువాత కాయగూరలు అన్నింటిని వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత బటానీలు మరియు పెరుగుని కూడ ఈమిశ్రమంలోకి ఒంచుకోవాలి. ఈమిశ్రమానికి కొలత ప్రకారం నీటిలొ కలిపిన బియ్యాని ఒంచుకొవాలి మొత్తం మిశ్రామాని ఉడకబెట్టాలి. ఉడికిన అన్నంలొ నేతిలొ వేగించిన జీడిపప్పు, ఎండుద్రాక్షాను కలపాలి. ఎంతొ రుచికరమైన వెజ్ మసాల రైస్ తయారైంది.
   
 


 

0

Besan Wheat Ravva Halwa Recipe | How to make Besan Wheat Ravva Halwa 

Ingredients:- Clarified Butter 1/2 cup, Gram Flour 1 Cup, Jaggery 2, Milk 3/4th Cup, Wheat Flour 1/4th Cup, Corn Flour 1/2 tsp, Wheat Ravva, Elaichi, Cashews 12(or)15, Condensed Milk it's optional. 

 తయారీకి కావలసిన పదార్దాలు:- నెయ్యి అరకప్పు, శనగపిండి ఒక కప్పు, బెల్లం రెండు, పాలు కప్పుకి మూడోవంతు, గొధుమ పిండి కప్పుకి నాలుగోవంతు(ఐచ్చికం), మొక్కజొన్న పిండి అర టీస్పూన్(ఐచ్చికం), గొధుమ రవ్వ, యాలకులు, జీడిపప్పు పన్నెండు (లేదా) పదిహేను, కండెన్సెడ్ మిల్క్ (ఘనీక్రుత పాలు)(ఐచ్చికం).  

 తయారీ విదానము:-  పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకొని అందులో నెయ్యి   కరిగిన తరువాత శనగపిండి మొత్తం వొంచుకోవాలి. ఈ శనగపిండి అంతా పచ్చి వాసన పోయి రంగు మారేంతవరుకు కలుపుతూ ఉండాలి శనగపిండి రంగు మారేలోపు వేరోక పొయ్యి మీద బాణలి పేట్టి నీళ్ళు పోసుకోని ఇందులో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు కప్పుకి నాలుగోవంతు గొధుమపిండి మరియు అరటీస్పూన్ మొక్కజొన్నపిండిని పాలను ఉపయోగించుకుంటు జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రంగుమారిన శనగపిండిలోకి జతచేసుకోవాలి. ఇది అంతా కలిసిన తరువాత పాలను శనగపిండి మిశ్రమంలోకి పోసుకోవాలి. అరగంట ముందు ననపెట్టుకున్న గొధుమ రవ్వను నీరువొంపుకోని శనగపిండి మిశ్రమంలోకి జతచేసుకోవలి. ఇది అంత కలిసినతరువాత బెల్లం కరిగించుకున్న నీళ్ళను నెమ్మదినెమ్మదిగా శనగపిండిలోకి జతచేసుకోంటు కలుపుకోవాలి బెల్లం అంతా కలిసిన తరువాత కండెన్సెడ్ మిల్కు కుడా కలుపుకొవాలి. కొద్దిగ రంగు మారిన తరువాత యాలకుల పొడిని జీడిపప్పులను  వొంచుకొని బాగ కలుపుకోవలి. ఎంతో రుచికరమైన శనగపిండి గొధుమ రవ్వ హల్వా తయరైంది.






0

Wheat Flour Condensed Milk Halwa Recipe | How to make గొధుమ పిండి హల్వా.

Ingredients:- Wheat Flour 1/2 Cup, Condensed Milk 1/3rd Cup (it's optional), Sugar 1/2 Cup, Clarified Butter (ghee) 1/2 Cup,  1 tsp Cardamom Powder, 1/2 tsp Pineapple Essence (it's optional), 1.5 Cup Water, Almonds 10

గొధుమ పిండి హల్వాకి కావలసిన పదార్దాలు:-  గొధుమ పిండి అర కప్పు, కండెన్సెడ్ మిల్క్(ఘనిక్రుత పాలు) కప్పుకి ముడోవంతు (ఐచ్చికం), పంచదార అరకప్పు, నెయ్యి అరకప్పు, యాలకుల పొడి ఒక టీస్పూన్, అనాస పండు ఎస్సెన్స్ అర టీస్పూన్ (ఐచ్చికం), ఒకటిన్నర కప్పు నీళ్ళు, బాదం పప్పులు పది.  

తయారి విదానము:- సన్న మంట మీద బాణలి పెట్టుకొని నెయ్యి వొంచుకోవాలి. నెయ్యి కరిగిన తరువాత గోధుమ పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యిలొ జత చేసిన గొధుమ పిండిని బంగారు వర్ణంలోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు వేరొక పొయ్యిని తక్కువ మంట మీద వెలిగించి మరోక గిన్నెను పెట్టి పంచదారలొ నీళ్ళు కలుపుకోవాలి. ఈ పంచదార నీళ్ళు మరుగుతునప్పుడు పక్కన బంగారు వర్ణంలోకి మారిన గోధుమ పిండికి కొద్దికొద్దిగా జత చేయాలి. పంచదార నీళ్ళు గోధుమ పిండిలొ యింకిన తరువాత కండెన్సెడ్ మిల్క్ (ఘనీక్రుత పాలు) వేయ్యాలి. ఈ మిశ్రమంలోకి పైనాపిల్ ఎస్సెన్స్(అనాసపండు ఎస్సెన్స్) రుచి కొరకు కలుపుతాం. ఇదే మిశ్రమంలోకి యాలకుల పొడి మరియు బాదం ముక్కలను వేసుకొని బాగా కలియపెట్టి పొయ్యిని ఆపుకోవాలి. ఎంతొ రుచికరమైన గొధుమపిండి హల్వా తయారైంది.     






0

Sabudana Dal Crackers Recipe | How to make Sabudana Dal Crackers


Ingredients:- 1 Cup Rice Flour, Sabudana, Urad dal, Water, Oil, Ginger Garlic Green Chili Paste, Oil for Deep Fry, Turmeric Red Chili Powder Cloves Cinnamon Powder Jeera Powder Ajwain Powder, Curry Leaves Coriander Leaves, Enough Salt.

తయారీకి కావలసిన పదార్ధములు :- ఒక కప్పు బియ్యంపిండి, సగ్గుబియ్యం మినప్పప్పు, నీళ్ళు, నూనె, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, వేయించుకోవటానికి సరిపడు నూనె, పసుపు కారం చెక్క మొగ్గ పొడి జిలకర పొడి వాము పొడి, తరిగి పెట్టుకొన్న కొత్తిమిర కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు. 

    తయారీ విదానము:- బియ్యప్పిండిలో నానపెట్టుకున్న సగ్గుబియ్యం మినప్పప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, తరిగిన కొత్తిమీర కరివేపాకు, పసుపు, కారం, చెక్కమొగ్గపొడి, జిలకరపొడి, వాముపొడి, వేడిచేసుకొన్న నూనెను ఒంచి మొత్తాన్ని కలపాలి. ఈమిశ్రమాన్ని గోరు వెచ్చని నీటితొ పిండి చేసుకోవాలి. ఈపిండిని సుమారు పదిహేను నిమిషములు తరువాత చిన్న చిన్న ముద్దలు రూపములొ చేసుకోవాలి. ఈముద్దలను అరచేతిలొ లేదా చపాతి కర్రతొ చిన్న చిన్న పప్పు చెక్కల ఆకారంలొ చేసుకొని కాగుతున్న నూనెలొ దోరగా వేయించుకోవాలి. 









0