Follow by Email

Menu

Semolina Balls Recipes | Semolina Balls Sweet | How to prepare Semolina Balls

Semolina Balls Recipes | Semolina Balls Sweet | How to prepare Semolina Balls

   Ingredients:- 1 Cup Semolina, 1 Cup Sugar, 1/2 Cup Dry Coconut Powder, Small Cup Milk, 3 or 4 tbsp Ghee, Garnish Cashew (or) Almonds.

  తయారికి కావలసిన పదార్ధములు:- ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు చక్కెర, అర కప్పు ఎండు కొబ్బరి తురుము, చిన్న కప్పు పాలు, మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి, అలంకరణ కోసం జీడిపప్పు లేదా బాదం పప్పు.



తయారీ విదానము:-  తక్కువ మంట పై బాణలి పెట్టి రవ్వను వొంచుకొని పచ్చి వాసన పొయే వరకు వేయించుకోవాలి. వేయించిన రవ్వను బాణలి నుంచి వేరుచేసి పక్కన బౌల్ లొ పెట్టాలి. ఇదే బాణలిలొ నెయ్యిని వొంచుకొని కరిగిన తరువాత జీడిపప్పు పలుకులను కలుపుకొని దోరగ వేయించాలి. దోరగ నెయ్యిలొ వేయించిన జీడిపప్పును బాణలి నుంచి వేరొక బౌల్ లోకి వొంచుకొవాలి. అదే బాణలిలొ ఎండుకొబ్బరి తురుముని కూడా పచ్చివాసన పొయే వరకు వేయించుకోవాలి.
బాణలిలొ దోరగ వేగిన కొబ్బరి తురుముకు వేయించిన రవ్వను, పంచదారను, యాలకుల పొడిని జతచేసుకొవలి. ఈమిశ్రమం అంతా బాగా కలిసిన తరువాత వేయించిన జీడిపప్పుని కుడా జతచేయాలి.
సన్న మంట పై ఉన్న పొయ్యిని పూర్తిగా ఆపేసుకొవాలి. బాణలిలొ ఉన్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగ పాలను వొంచుకొంటు లడ్డుల్లా చుట్టుకోవాలి.

సూచన:- ఈ లడ్డూలు ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.

No comments:

Post a Comment