Follow by Email

Menu

Instant Sambar Rice Recipe | How to make Sambar Rice

Instant Sambar Rice Recipe | How to make Sambar Rice


Ingredients:- Pigeon Peas, Rice, Tomato 3, Onion 1, Green Chili, Red Chili, Coriander, Curryleaves, Okra, Dry Coconut, Black Pepper, Cinnamon, Coriander Seeds, Split Bengal Gram, Red chili, Tadka, Asafoetida, Turmeric, Oil, Tamarind Water, Salt, Vegetables (Brinjal, Radish, Carrot, Potato).

తయారీకి కావలసిన పదార్దాలు:- కందిపప్పు, బియ్యం, టమోట మూడు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమిర, కరివేపాకు, బెండకాయ, ఎండుకొబ్బరి, మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, శనగబేడలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, ఇంగువ, పసుపు, నూనె, చింతపండు నీళ్ళు, ఉప్పు కాయగూరలు(వంకాయ, ముల్లంగి, క్యారట్, బంగాళాదుంప).









 తయారీ విదానము:- ఎండుకొబ్బరి, మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, శనగబెడలు, ఎండుమిర్చి వీటన్నింటిని బాణలి పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగాక చల్లారనిచ్చి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తరువాత మెత్తని పొడిగా వస్తుంది తరువాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టుకొని నూనె వొంచుకోవాలి కాగిన తరువాత తాళింపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తరువాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కలపాలి. ఇవ్వన్ని వేగాక బెండకాయని కూడా వేసి కలపాలి. కలిపిన ఈ బెండకాయ మిశ్రమంలో టమోటాను కూడా జతచేసి మగ్గనివ్వలి. మగ్గిన తరువాత పసుపు ఇంగువ వేసి కలిపి నీరు వొంపేసి పెట్టుకొన్న కాయగూర ముక్కలనింటిని కొద్దిగ నీళ్ళు పొసి ఉప్పు వేసి ఉడకపెట్టాలి. ఇవి అన్ని ఉడికేలోపు మసాలాను తయారు చేసుకొందాం. ఉడికించిన పప్పులో సాంబార్ పొడి చింతపండు నీళ్ళు పొసి కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకొంటున్న కాయగూర ముక్కలనింటిలో మసాలాను కలిపిపెట్టుకొన్న పప్పును వేసి కలపాలి. రెండు నిమిషాలు మూతపెట్టుకొని మగ్గనివ్వాలి మగ్గిన ఈ మిశ్రమంలో కొత్తిమిర బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడూ విస్సిల్స్ వచ్చేవరకు ఉంచాలి. విస్సిల్స్ అయిన తరువాత మూత తీసేసి తయారైన సాంబార్ అన్నం పై కొత్తిమిరను చల్లుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన సాంబార్ అన్నం తయారు.        




No comments:

Post a Comment