Follow by Email

Menu

Shankarpali Recipe | How to make Shankarpali Sweet

Shankarpali Recipe | How to make Shankarpali Sweet



  Ingredients:- Wheat Flour 1 Cup, Sugar 1/2 Cup Water 1/2 Cup, Bread (it's optional), Cinnamon (it's optional), Milk (it's optional), Cardamom, Clarified Butter, Oil for Deep fry.
  
  తయారీకి కావలసిన పదార్ధాలు:- గొధుమ పిండి ఒక కప్పు, పంచదార అర కప్పు నీళ్ళు అర కప్పు, బ్రెడ్ ముక్కలు మూడు (ఐచ్చికం), దాల్చిన చెక్క పొడి (ఐచ్చికం), పాలు (ఐచ్చికం), యాలకుల పొడి, నెయ్యి, నూనె వేయించేందుకు సరిపడా.



తయారి విదానము:- గొధుమ పిండి ఒక బౌల్లొకి తీసుకొని అందులో బ్రెడ్ ముక్కలని పొడి చేసుకొని గొధుమ పిండిలో వేసుకోవాలి తరువాత యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, నెయ్యి, పాలు వేసి కలుపుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకొని అర కప్పు పంచదార, అర కప్పు నీళ్ళు వొంచుకొని పంచదారను కరిగించుకోవాలి. కరిగిన పంచదార నీటిని చల్లారిన తరువాత కొద్ది కొద్దిగ గొధుమ పిండి మిశ్రమములోకి చల్లుకొంటు కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా మృదువుగా వచ్చేంతవరకు కలపాలి దీనిని ఒక గంటసేపు పక్కన పెట్టుకోవాలి. గంటసేపు అయిన తరువాత మృదువైన ఈ మిశ్రమం అంతటిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగ తీసుకొని కర్రతో చపాతి వలే వొత్తుకొని నచ్చిన ఆకారాలుగ ముక్కలు చేసుకొని నూనెలొ గొధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎంతొ రుచికరమైన శంకర్ పాలి తయారైంది.






No comments:

Post a Comment