Follow by Email

Menu

Stuffed Brinjal Curry Recipe | How to make Stuffed Brinjal Curry (ఆంధ్ర గుత్తి వంకాయ కూర)

Stuffed Brinjal Curry Recipe | How to make Stuffed Brinjal Curry  (ఆంధ్ర గుత్తి వంకాయ కూర)





 

Ingredients:- Brinjal, Onions 3, Red Chili, Dry Coconut, Black Pepper, Coriander Seeds, Split Bengal Gram, Tamarind Water, Turmeric, Asafoetida, Salt, Oil, Cottage Cheese (it's optional), Cashews (it's optional), Coriander Leaves, Curry Leaves. 

తయారీకి కావలసిన పదార్ధాలు:- వంకాయలు, ఉల్లిపాయలు మూడు, ఎండుమిర్చి, ఎండుకొబ్బరి, మిరియాలు, ధనియాలు, శనగబేడలు, చింతపండు నీళ్ళు, పసుపు, ఇంగువ, ఉప్పు, నూనె, పన్నీర్ (ఐచ్చికం), జీడిపప్పు (ఐచ్చికం), కొత్తిమిర, కరివేపాకు.

 తయారీ విదానము:- ఎండుమిర్చి, ఎండుకొబ్బరి, మిరియాలు,ధనియాలు, శనగబేడలు తయారీ విదానము:- వీటన్నిటిని వేగించుకొని చల్లారిన తరువాత మిక్సి పట్టి పొడి చేసుకొని పక్కన పెట్టుకొందాం.మిక్సి పట్టిన పొడిని కొద్దిగ వంకాయల కొరకు కొద్దిగ మసాల కొరకు వేరు చేసుకోవాలి.  నీటిలో కడిగిన వంకాయలకు పైన తొడిమి తీసివేయాలి, ఈ వంకాయలను వేనుక వైపు నాలుగు భాగాలుగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన భాగాలకు ఉప్పుని రాయాలి. పక్కన ఉంచిన పొడికి చిన్న ముక్కలు చేసుకొన్న ఉల్లిపాయలు ఉప్పు చింతపండు నీళ్ళు కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను కట్ చేసిన వంకాయలకి కూర్చుకోవాలి. కూర్చిన వంకాయలను పక్కన పెట్టుకొందాము. పొయ్యి మీద బాణలి ఉంచి నూనె పొసి, కరివేపాకు వేసుకొని, సన్నగ పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పును కలపాలి. ఇప్పుడు మసాల కొరకు పక్కన పెట్టిన పొడికి చింతపండు నీళ్ళను జతచేసి, ఈ మొత్తం మిశ్రమాన్ని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన మసాల మిశ్రమానికి కూర్చిన వంకాయలను జొడించాలి. ఇప్పుడు బాణలి పై మూతను ఉంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మగ్గిన వంకాయ కూరను సర్వింగ్ బౌల్లొకి తీసుకోవాలి. ఈ బౌల్లొని కూరపై కొత్తిమిర, పన్నీర్ , వేయించుకొన్న జీడిపప్పును వేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆంద్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర తయార్.  
 
                  

No comments:

Post a Comment