Follow by Email

Menu

Veg Masala Rice Recipe | How to make Veg Masala Rice వెజ్ మసాల రైస్


Veg Masala Rice Recipe | How to make Veg Masala Rice వెజ్ మసాల రైస్
Ingredients:- Onion -1, Mint Leaves, Tomato -1, Bay Leaves 2, Green Chilies 7, Ginger Garlic Paste, Cinnamon, Cloves, Fennel, Cumin, Black pepper, Star Anise Mace, Wailong, Clarified Butter 6 tbsp, Solt, Red Chili Powder, Garam Masala Powder, Curd 2 spoons, Cashews, Raisins, Oil 2 tbsp,  Vegetables ( Carrot, Potato, Beans, Capsicum, Cabbage), Green Peas, Soaked Rice.

తయారీకి కావలసిన పదార్ధాలు:- ఉల్లిపాయ ఒకటి, పొదీనా ఆకులు, టమోట ఒకటి, బిరియాని ఆకులు రెండు, పచ్చిమిరపకాయలు ఏడు, అల్లం వెల్లులి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, శోంప్, జిలకర, మిరియాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, నెయ్యి ఆరు టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, గరం మసాల పొడి, పెరుగు రెండు స్పూన్లు, జీడిపప్పు, ఎండిద్రాక్ష, నూనె రెండు స్పూన్లు, కాయగూరలు ( క్యారెట్, బంగాళదుంప, బీన్స్, బెంగుళూరు మిరపకాయలు, కోస్ పువ్వు (కాబెజి)), ముడి బటాని, బియ్యం. 

   
తయారి విధానం:- పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకొని బాణలిలొ నెయ్యి మరియు నూనె ఒంచుకొని నూనె కాగిన తరువాత జిలకర, బిరియాని ఆకులు, మసాల దినుసులు వేసి రెండు నిమిషాలు వెగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పొదీనా ఆకులతొ ఉప్పును కూడ కలిపి వేగనివ్వాలి. గరం మసాల పొడి, కారం పొడి, పొయ్యి వెలుగుని తగ్గించుకుని టమోటాని కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. రెండు లేద మూడు నిమిషాలు తరువాత కాయగూరలు అన్నింటిని వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత బటానీలు మరియు పెరుగుని కూడ ఈమిశ్రమంలోకి ఒంచుకోవాలి. ఈమిశ్రమానికి కొలత ప్రకారం నీటిలొ కలిపిన బియ్యాని ఒంచుకొవాలి మొత్తం మిశ్రామాని ఉడకబెట్టాలి. ఉడికిన అన్నంలొ నేతిలొ వేగించిన జీడిపప్పు, ఎండుద్రాక్షాను కలపాలి. ఎంతొ రుచికరమైన వెజ్ మసాల రైస్ తయారైంది.
   
 


 

No comments:

Post a Comment