Follow by Email

Menu

Wheat Flour Condensed Milk Halwa Recipe | How to make గొధుమ పిండి హల్వా

Wheat Flour Condensed Milk Halwa Recipe | How to make గొధుమ పిండి హల్వా.

Ingredients:- Wheat Flour 1/2 Cup, Condensed Milk 1/3rd Cup (it's optional), Sugar 1/2 Cup, Clarified Butter (ghee) 1/2 Cup,  1 tsp Cardamom Powder, 1/2 tsp Pineapple Essence (it's optional), 1.5 Cup Water, Almonds 10

గొధుమ పిండి హల్వాకి కావలసిన పదార్దాలు:-  గొధుమ పిండి అర కప్పు, కండెన్సెడ్ మిల్క్(ఘనిక్రుత పాలు) కప్పుకి ముడోవంతు (ఐచ్చికం), పంచదార అరకప్పు, నెయ్యి అరకప్పు, యాలకుల పొడి ఒక టీస్పూన్, అనాస పండు ఎస్సెన్స్ అర టీస్పూన్ (ఐచ్చికం), ఒకటిన్నర కప్పు నీళ్ళు, బాదం పప్పులు పది.  

తయారి విదానము:- సన్న మంట మీద బాణలి పెట్టుకొని నెయ్యి వొంచుకోవాలి. నెయ్యి కరిగిన తరువాత గోధుమ పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యిలొ జత చేసిన గొధుమ పిండిని బంగారు వర్ణంలోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు వేరొక పొయ్యిని తక్కువ మంట మీద వెలిగించి మరోక గిన్నెను పెట్టి పంచదారలొ నీళ్ళు కలుపుకోవాలి. ఈ పంచదార నీళ్ళు మరుగుతునప్పుడు పక్కన బంగారు వర్ణంలోకి మారిన గోధుమ పిండికి కొద్దికొద్దిగా జత చేయాలి. పంచదార నీళ్ళు గోధుమ పిండిలొ యింకిన తరువాత కండెన్సెడ్ మిల్క్ (ఘనీక్రుత పాలు) వేయ్యాలి. ఈ మిశ్రమంలోకి పైనాపిల్ ఎస్సెన్స్(అనాసపండు ఎస్సెన్స్) రుచి కొరకు కలుపుతాం. ఇదే మిశ్రమంలోకి యాలకుల పొడి మరియు బాదం ముక్కలను వేసుకొని బాగా కలియపెట్టి పొయ్యిని ఆపుకోవాలి. ఎంతొ రుచికరమైన గొధుమపిండి హల్వా తయారైంది.     






No comments:

Post a Comment