Follow by Email

Menu

Sapodilla Ice Cream Recipe | How to make Sapota Ice Cream

Sapodilla Ice Cream Recipe | How to make Sapota Ice Cream

   Ingredients:- Sapodilla, Fresh Cream, Milk, Condensed Milk, Sugar Powder, Corn Flour, Almonds, Cashews, Pistachio, Charoli.
    తయారీకి కావలసిన పదార్దాలు:- సపోట, తాజామీగడ, పాలు, ఘనీక్రుత పాలు (కండెన్సెడ్ మిల్క్), పంచదార పొడి, మొక్కజొన్న పిండి, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, సారపప్పు.
తయారీ విదానము:- సపోటాలకు తొక్కు తీసి గుజ్జుగా చేయాలి. బౌల్ లోకి తాజామీగడ వొంచుకొని బ్లెండ్ చేసుకొని సపోటాల గుజ్జుని జతచేయాలి, ఈ మిశ్రమాన్ని బ్లెండ్ చేయాలి. ఇందులో పంచదార పొడి, పాలు, ఘనీక్రుత పాలు, మొక్కజొన్న పిండిని వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తరువాత దీనిని గాలి చొరబడని డబ్బాలొకి చేర్చుకోవాలి ఈ డబ్బాపై మూత బిగించి డీప్ ఫ్రీజ్ (అతి శీతలీకరించు) లొ రెండు గంటలు ఉంచాలి. రెండు గంటల తరువాత డీప్ ఫ్రీజ్ నుంచి డబ్బాను తీసి సపోటా మిశ్రమాన్ని బ్లెండ్ చేసి డీప్ ఫ్రీజ్ లొ తిరిగి రెండు గంటల సేపు ఉంచాలి. పైన చెప్పిన విధముగ రెండు గంటల చొప్పున నాలుగు సార్లు చేయాలి. నాలుగు సార్లు చేసిన తరువాత ఐదవ సారి పది లేదా పన్నెండు గంటల సేపు డీప్ ఫ్రీజ్ లొ ఉంచాలి. పన్నెండు గంటలు దాటిన తరువాత డబ్బలొ ఐస్ క్రీం తయారై వుంటుంది. ఈ సపోటా ఐస్ క్రీంకు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, సారపప్పులను రుచి కొరకు చేర్చుకోవాలి. 



No comments:

Post a Comment