Follow by Email

Menu

Vermicelli Idly Recipe | How to make Vermicelli Idly

How to make Vermicelli Idly సేమ్య ఇడ్లి, రవ్వ పెరుగు ఇడ్లి
  Ingredients:- Vermicelli, Semolina, Curd, Water, Red Chili, Green Chili, Curry Leaves, Ginger, Tadka, Cottage Cheese, Cashews Oil, Salt, Black Pepper Powder.

  తయారీకి కావలసిన పదార్దాలు:- సేమ్యా, బొంబాయి రవ్వ, పెరుగు, నీళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, పన్నీర్, జీడిపప్పు, తాళింపుదినుసులు, నూనె, ఉప్పు, మిరియాల పొడి.
 
  वांछनीयसामग्री:- सेवइयां, सुजी, दही, पानी, लाल मिरची, हरी मिरची, कढीपत्ता, अदरक, पनीर, काजू, तड़का, तेल
नमक, कालीमिरच पौडर.
   తయారి విదానము:- పొయ్యి వెలిగించి బాణలి పెట్టుకొని సేమ్యా వేసి కొద్దిగ నూనెను వొంచుకొని వేగించుకొవాలి. సేమ్యా వేగిన తరువాత బాణలి నుంచి వేరు చేసి బౌల్లొ పక్కన పెట్టుకోవాలి. బాణలిలొ బొంబాయి రవ్వను వొంచుకొని కొద్దిపాటి నూనెతొ వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన బొంబాయి రవ్వకు పక్కన పెట్టిన సేమ్యాను బాణలిలోకి వొంచుకోవాలి. తక్కువ మంట మీద ఈ రెండిటిని కలిపి వేగించి, ఈ బాణలిని పక్కన పెట్టుకొవాలి. పొయ్యి మీద మరొక బాణలి పెట్టి నూనెను వొంచుకొని పోపుదినుసులను వేయించుకొవాలి వీటితొ పాటు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, మిరియాలపొడి, జీడిపప్పులను వేసి వేయించి ముందుగ వేయించిన సేమ్యా బొంబాయి రవ్వను కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత పెరుగు, కొద్దిగ నీళ్ళు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఒక గంట వరకు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొవాలి. గంట తరువాత పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని పక్కన ఉన్న మిశ్రమానికి సరిపడా నీళ్ళను వొంచుకోవాలి. ఈ పాత్రలొని నీళ్ళను మరిగనివ్వాలి నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్ కు నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. పక్కన ఉన్న పిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లొకి వొంచుకొని నీరువొంచిన ఇడ్లీ పాత్రలొకి పెట్టుకొని పాత్రపై మూతను వుంచి పది నిమిషాలు వుడికించాలి. పది నిమిషాల తరువాత ఇడ్లీ ప్లేట్ నుంచి తయారైన సేమ్యా ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొవాలి.      






No comments:

Post a Comment